Tuesday, July 15, 2025
Homeతెలంగాణవిష జ్వరాలు, వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

విష జ్వరాలు, వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ఈ వర్షాకాల సీజన్లో విష జ్వరాలతో పాటు వివిధ వ్యాధులు ప్రభలే అవకాశం వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులపై గురువారం కలెక్టర్‌ కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, నర్సింగ్‌ సూపర్డెంట్లు, ఫార్మాసిస్టులు ఈ ప్రత్యేక సమావేశం లొ పాల్గొన్నారు. జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో రాబోయే రోజుల్లో విష జ్వరాలు అధికంగా ప్రభలే అవకాశం ఉందన్నారు. అన్ని రకాల మందులు, రీఏజెంట్లు, టెస్టింగ్‌ కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. వివిధ హోదాల్లో ఉన్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఇప్పటికే అన్ని ఆసుపత్రులలో కావాల్సిన మందులు రీఏజెంట్లు, మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసిన క్రమంలో రాబోయే రోజుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రులలో ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి తగిన పరిష్కార ఏర్పాట్లు తాను చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అవసరమైన నిధులు మంజూరుకి ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో ఇన్సులిన్‌, మలేరియా మందులు అందుబాటులో లేవని వాటి గురించి వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా రాష్ట్ర అధికారులతో మాట్లాడి వాటిని అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు కృషి చేసారు. డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవిబాబు, వివిధ ఆసుపత్రుల సూపరింటెం డెంట్లు, ఫార్మసిస్టులు, నర్సింగ్‌ సూపరింటెండెం ట్‌లు శానిటేషన్‌ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు