విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించి చివరి విడతగా రూ.567 కోట్ల గ్రాంట్‌ను కేంద్రం మంజూరు చేసింది. 19 నెలల్లోనే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 48 శాతం వినియోగం జరిగింది. పూర్తిస్థాయిలో 15వ ఆర్థిక సంఘం నిధులు పొందిన మూడో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇప్పటివరకు తమిళనాడు, త్రిపుర రాష్ట్రాలే ఈ ఘనత దక్కించుకున్నాయి. వైద్యారోగ్యశాఖకు 202223 నుంచి 2025`26 వరకు మొత్తం రూ.2,600 కోట్ల నిధులు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉండగా… మిగిలిన రూ.567 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. వాటితోపాటు మిగిలిన నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖతో చర్చలు ప్రారంభించేందుకుగాను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నేతృత్వంతో అధికారుల బృందం చర్యలకు సిద్ధమైంది.
దీంతో ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన మొత్తం రూ.2,600 కోట్ల గ్రాంట్‌ను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఆయూష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల అవసరాల మేరకు భవనాల నిర్మాణం, డయాగ్నోస్టిక్ సేవలను మెరుగుపర్చడానికి వాటిని ఉపయోగిస్తారు. బ్లాక్ లెవల్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీల ఏర్పాటుకు వినియోగిస్తారు. గ్రాంట్ విడుదల చేయడం పట్ల మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఏపీకి కేంద్రం నిధులు రూ.567 కోట్లు
- Advertisement -


