Homeవ్యాపారంసరికొత్త ‘క్లాసిక్స్ మోనెటా మూన్‌ఫేజ’ వాచీ విడుదల

సరికొత్త ‘క్లాసిక్స్ మోనెటా మూన్‌ఫేజ’ వాచీ విడుదల

- Advertisement -

ముంబయిః ఫ్రెడెరిక్ కాన్స్టాంట్ తన ‘క్లాసిక్స్ మోనెటా మూన్‌ఫేజ’ వాచీని ఆవిష్కరించింది. ఈ వాచీలో సాంప్రదాయ ఫ్లూటెడ్ బెజెల్ డిజైన్‌ను వాచీ ఫ్లాంజ్ కు మార్చారు. దీనివల్ల వాచీ కేసు అచ్చం ఒక నాణెం లాగా కనిపిస్తుంది, అందుకే దీనికి ‘మోనెటా’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు జెనీవాకు చెందిన ఈ తయారీ సంస్థ దీనికి మరింత స్టైల్‌ను జోడించి, బ్లూ లేదా సిల్వర్ డయల్స్‌తో ఉన్న రెండు ఒరిజినల్ మోడళ్లకు సరికొత్త రూపాన్ని ఇచ్చి, వాటిని సరికొత్త అలంకరణ కోణంలోకి తీసుకువెళ్ళింది. మొదటి కొత్త వేరియంట్ కోసం, ఫ్రెడెరిక్ కాన్స్టాంట్ ఎల్లో గోల్డ్ పీవీడీ కేస్‌ను ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే హ్యాండ్స్ (ముల్లులు), అవర్ మార్కర్‌లను (గంటల సూచికలు) తీర్చిదిద్దింది – ఇది క్లాసిక్, ప్రెస్టీజ్ లుక్‌ను ఇస్తుంది. ఇక రెండవ వాచీలో మొట్టమొదటిసారిగా ‘మిలనీస్ మెష్ బ్రేస్‌లెట’ ను ఉపయోగించారు. ఇది వాచీ కేసు, బయటి భాగాలు, ఆరు గంటల స్థానంలో ఉన్న చంద్రుడి డిస్‌ప్లే స్టీల్ రంగును అద్భుతంగా హైలైట్ చేస్తూ మరింత వింటేజ్ రూపాన్ని ఇస్తుంది. ఈ రెండు వాచీలు 37-మిల్లీమీటర్ల డయామీటర్ గల కేసును కలిగి ఉంటాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు