Homeహార్డ్‌వేర్ హబ్‌గా ఏపీ

హార్డ్‌వేర్ హబ్‌గా ఏపీ

- Advertisement -
  • పోర్ట్ ఇన్ఫ్రా ఎకో సిస్టమ్‌గా తీరప్రాంత అభివృద్ధి
  • రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం
  • 28 ప్రాజెక్టులతో 19,739 మందికి ఉద్యోగాల కల్పన

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను కీలక హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు తీర ప్రాం తం వెంబడి పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకో వాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివా లయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశమైంది. మొత్తం 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపై చర్చించి ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఏపీని దేశం లోనే ప్రముఖ హార్డ్‌వేర్ తయారీ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. సెమీ కండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకే తిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా తగిన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కేవలం ఎలక్ట్రానిక్స్‌ తయారీతో ఆగకుండా పరిశోధన, డిజైన్‌ల రూపకల్పన మాన్యుఫ్యాక్చరింగ్‌తో పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. డ్రోన్, స్పేస్ సిటీల సమీపంలో ఆయా రంగాలకు అనుబంధంగా ఉండే క్లస్టర్ పరిశ్రమలు ఏర్పడేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించగా… రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు తైవాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
లాజిస్టిక్స్‌ హబ్‌గా ఏపీ
పోర్టులు-షిప్బిల్డింగ్-లాజిస్టిక్స్‌-పరిశ్రమలను అనుసంధానించే సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఆంధ్ర ప్రదేశ్ను లాజిస్టిక్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. పోర్టులు, రైలు, రోడ్డు, ఎయి ర్ కార్గో, అంతర్గత జల రవాణా వంటి అన్ని రవా ణా మార్గాలను అనుసంధానం చేసి సమగ్ర లాజిస్టి క్స్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. శ్రీసిటీ తో తిరుపతి జిల్లా ఎగుమతుల్లో దేశంలోనే 10వ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా 12వ స్థానంలో ఉందని… దీనిని ఎగుమతుల్లో టాప్-5లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. పీఎం సేతును కూడా అనుసంధానం చేసుకుంటూ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. విశాఖపట్నంలోని అదానీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో నైపుణ్య శిక్షణతో పాటు సివిల్ ఏవి యేషన్ సహా ఎంఆర్వో ఫెసిలిటీని కూడా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు పరిశీలించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
రేర్ ఎర్త్ మినరల్స్‌పై ప్రత్యేక దృష్టి
రేర్ ఎర్త్ మినరల్స్‌ ఆధారిత ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమలు, పరిశోధన, తయారీ రంగాలను అనుసంధానం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని, టీటీడీ పరిధిలోని భవనాలపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో ఇప్పటికే 511 చార్జింగ్ స్టేషన్‌లకు అనుమతులిచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం నిర్దేశించుకున్న 160 గిగావాట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 113,75 గిగావాట్లకు సంబంధించి పెట్టుబడులు సాధించినట్టు అధికారులు వివరించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో హైడ్రోజన్ వ్యాలీ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు పరిశ్రమలు, ఐటీ, ఐ అండ్ ఐ Xఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు