విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా 87 మున్సిపాల్టీలు/ నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 18వ తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేస్తామని, 23వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వైస్ చైర్పర్సన్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు, చైర్పర్సన్లు, మేయర్లు ఒక వార్డు సభ్యుడిని డిప్యూటీ మేయర్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకోన్నుారని పునేఠా తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా నిర్ణీత తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేసి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నికల కమిషనర్ పునేఠా సూచించారు. అనివార్య కారణాల వల్ల 23వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించకపోతే, ఆ ఎన్నికల ప్రక్రియను 24 తేదీన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ ఎన్నికలతో పట్టణ స్థానిక సంస్థల్లో పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియ మరింత ముందుకు సాగనుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సహకరించాలని సూచించారు.
23న డిప్యూటీ మేయర్ల ఎన్నిక
- Advertisement -
RELATED ARTICLES


