జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో ధర్మవరం మండలం, తుమ్మల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు చేరడం జరిగింది. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి పార్టీలో చేరిన వారిని ఘనంగా ఆహ్వానిస్తూ జనసేన పార్టీ కండువాలను వేసి సత్కరించారు. చేరిన వారి పేర్లు ఎం.నారాయణమ్మ, ఎం.శ్వేత, జి.జయమ్మ, జి.నవీన్ కుమార్ రెడ్డి, ఎం..చెన్నారెడ్డి, ఎం.నారాయణరెడ్డి,నాగేంద్ర,రాజశేఖర్, బి.నారాయణస్వామి, శ్రీనివాసులు, అశోక్ మధుసూదన,గణేష్, వరదరాజులు తదితరులు చేరారు.ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు.
జనసేన పార్టీలోకి 50 కుటుంబాలు చేరిక..
- Advertisement -
RELATED ARTICLES


