Homeజిల్లాలుఅనంతపురంకలెక్టరేట్ కార్యాలయం వద్ద చేతి వృత్తిదారుల సమాఖ్య ధర్నా

కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేతి వృత్తిదారుల సమాఖ్య ధర్నా

- Advertisement -

సూపర్ పథకాలను అమలు చేయాలి …

చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సి. లింగమయ్య
విశాలాంధ్ర అనంతపురం : సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని, అనంత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర స్థాయి పిలుపుమేరకు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినట్లు చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సి. లింగమయ్య పేర్కొన్నారు. ఈ ధర్నాలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సి వి హరికృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు సి. లింగమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 56 కుల, వృత్తుల కార్పోరేషన్లను ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెరుగైన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చేతి వృత్తి దారులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడిచినా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను చేతి వృత్తి దారులందరికీ వర్తింప జేయాలని, కులం పేరుతో సామాజిక వివక్షతతో జరిగే దాడుల నుండి కాపాడటానికి సామాజిక భద్రతా చట్టాన్ని తీసుకొని వచ్చి అమలు చేసి వృత్తిదారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్
అప్లై చేసుకున్న చేతి వృత్తి దారులందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా స్వంత పూచికత్తుతో బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా రూ.2 లక్షలకు తగ్గకుండా సబ్సిడి రుణాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి వాగ్దానాలతోపాటు సూపర్ సిక్స్ వాగ్ధానాలను చేతి వృత్తి దారులందరికీ వర్తింపజేయాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన చేతి వృత్తిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. సామాజిక అణిచి వేతతో కులం పేరుతో చేస్తున్న దాడులనుండి కాపాడడానికి సామాజిక భద్రతా చట్టాన్ని తీసుకొని వచ్చి అమలు చేసి చేతి వృత్తిదారులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గొర్లు మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్ల పోతులయ్య స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బంగారు భాష, రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి నాగప్ప, జిల్లా నాయకులు మల్లికార్జున, కుమ్మర శాలివాహన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాజు లింగ, వడ్డెర సంఘం జిల్లా నాయకులు లాయర్ శ్రీనివాసులు, మహిళా సమాఖ్య నగర కార్యదర్శి జానకి, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమాఖ్య ఈశ్వరయ్య, గొర్ల మేకల పెంపకదారుల సంఘం నాయకులు సి. రాము, చేతి వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు టిసి భూషణ, వీరాంజి నాగరాజు సంజీవులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు