Homeజిల్లాలుఅన్నమయ్యకలెక్టర్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలి

కలెక్టర్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలి

- Advertisement -

జర్నలిస్టుల 50 శాతం రాయితీ పత్రాన్ని ఎంఈఓ కు అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు

విశాలాంధ్ర -రాజంపేట: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రైవేటు పాఠశాలల్లో వారి పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తూ విడుదల చేసిన ఉత్తర్వులు తక్షణమే ప్రైవేటు పాఠశాలలు విధిగా అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి రఘునాథ రాజు, సుబ్బరాయుడు లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, తాలూకా అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీతో కూడిన విద్యను అందించే దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులను ప్రతి ప్రైవేటు పాఠశాలలను అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామసుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు గౌనుపల్లి శ్రీనివాసులు, యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ తో సంప్రదించడం జరిగిందన్నారు, కలెక్టర్ సానుకూలంగా స్పందించి 50 శాతం రాయితీ ఇవ్వడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని వర్కింగ్ జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మలిశెట్టి సుబ్బరాయుడు, త్రివిక్రమ్, రాజంపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మందా శివయ్య, కోశాధికారి సునీల్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీహరి, వెంకటసుబ్బయ్య, నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు నరసింహ, మధు, దుర్గయ్య, రవీంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు