Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్యకర్తలు, నాయకులే పార్టీకి మూల స్తంభాలు..

కార్యకర్తలు, నాయకులే పార్టీకి మూల స్తంభాలు..

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యకర్తలు నాయకులే మూల స్తంభాలు అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి స్వగృహంలో ఇటీవల వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన చందమూరి నారాయణరెడ్డి కు, 37వ వార్డు ప్రజలు కార్యకర్తలు, పట్టణంలోని కౌన్సిలర్లు, సీనియర్ జూనియర్ నాయకులు కలిసి హర్షం వ్యక్తం చేస్తూ, ఇంతటి పదవిని నాకు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతూ గజమాలతో ఘనంగా సత్కరించారు. చందమూరి నారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ఆవిర్భావము నుండి తాను కార్యకర్తగా మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా ధర్మవరం ప్రజలకు సమస్యలపై పోరాటం సరిపి ఎన్నో విజయాలను సాధించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రస్థాయి పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మున్సిపల్ విభాగం అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేస్తానని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు కూడా నిరుత్సాహపడరాదని, ప్రజలు మన వెంట ఉన్నారని వారు ధైర్యం చెప్పారు. ప్రజా సేవయే పరమావిధిగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంపిణీ చేసుకొని మరోసారి చెందమూరి నారాయణరెడ్డి కి హర్షమును వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మాసపల్లి సాయికుమార్ ,రంగస్వామి, బాలం గోపాల్, కత్తే పెద్దన్న, రాజారెడ్డి, భాస్కర్ రెడ్డి, శివారెడ్డి, మిద్దె మల్లికార్జున, రామలింగం గౌడ్ చిన్న నారాయణరెడ్డి బాల నరసింహులు, కడవల ఈశ్వర్, బొమ్మన ,మద్దిలేటి, జింక కంబగిరి, చెన్న ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు