Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల ప్రజలు విసుగుచెందారు

గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల ప్రజలు విసుగుచెందారు

- Advertisement -

ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం; ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్ తరహాలో వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలోని 22వ వార్డు, సాయినగర్ లో ఆయన సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. పథకాల పేర్లు చెబుతూ ఇందులో ఏ పథకమైనా రాలేదా అని ఆరా తీశారు. కాలనీ వాసులు కొన్ని సమస్యలను శ్రీరామ్ దృష్టికి తీసుకునివచ్చారు. వెంటనే సచివాలయ సిబ్బందిని పిలిపించి వీటికి పరిష్కారం చూపించాలని సూచించారు. కొన్ని కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందలేదని చెప్పగా… వాటన్నింటినీ సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి పథకాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ధర్మవరం రూరల్ మండల పరిధిలోని కత్తెకొట్టల గ్రామానికి చెందిన బన్నెల కళ్యాణ్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు పొందారు. ఆరోగ్యశ్రీ వర్తించని కారణంగా ఆయనకు ఆర్థిక భారం ఉన్న నేపథ్యంలో సీఎంఆర్ ద్వారా 7లక్షల రూపాయల ఆర్థిక సాయం వచ్చేలా శ్రీరామ్ చూశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన కళ్యాణ్ కు అందజేశారు. ఇందుకు శ్రీరామ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఏడాది పాలన పై ప్రజల్లో సంతోషం కనిపిస్తోందని… అయితే కొన్ని సమస్యలు కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. వీటన్నింటిని తప్పకుండా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామన్నారు. వైసిపి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని ఎలా భయబ్రాంతులకు గురి చేశారో, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టించి, ఇబ్బంది పెట్టి వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే దోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడే మాటలకు, బెదిరింపులకు లొంగేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే టీడీపీ శ్రేణులకు ఇవన్నీ పట్టించుకోకుండా నాలుగేళ్ల పాటు ప్రజలకు మంచి చేయడంలోనే ఉండాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్, జూనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు