హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ లో మరోసారి కుండపోతగా వర్షం పడుతోంది. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, బోయినపల్లి, ఆల్వాల్, మల్కాజ్‌గిరి, మౌలాలి, బేగంపేట్, మలక్‌పేట్, చార్మినార్, ముషీరాబాద్, అబిడ్స్, కోటి, హిమాయత్ నగర్, కాచిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్ పేట్, అశోక్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, బంజారాహిల్స్, ఓయూ, తార్నాక, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, కొత్తపేట, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట, సరూర్‌నగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచుపల్లి, హఫీజ్‌పేట్, ఈసీఐఎల్, కప్రా, నేరేడ్‌మెట్, విద్యానగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయ్యాయి. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రెండు గంటల్లో నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందని GHMC పేర్కొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకురాకూడదని.. ముఖ్యంగా వరద నీటితో నిండిన ప్రాంతాల్లో తిరగకూడదని హెచ్చరిస్తోంది. ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసి 040-29555500, 9000113667 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది.