Homeజిల్లాలుకర్నూలుజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆట స్థలాన్ని బాగుచేయించండి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆట స్థలాన్ని బాగుచేయించండి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆట స్థలాన్ని బాగుచేయించాలంటూ బుధవారం పెద్దకడబూరులో మండల విద్యాధికారి- 2 రామ్మూర్తికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, మండల అధ్యక్షులు మహ్మద్ ఉసేన్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాల ఆట స్థలం బాగు చేయించేందుకు ప్రభుత్వం 5 లక్షలు కేటాయించిందన్నారు. కానీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా రాజేశ్వరి తూతూ మంత్రంగా పనులు చేసి అర్ధాంతరంగా పనులను నిలిపివేశారని విమర్శించారు. రన్నింగ్ ట్రాక్ కు ఇరువైపులా ఇటుకలతో చిన్న గోడ నిర్మించి మధ్యలో ట్రాక్ ఏర్పాటు చేయవలసి ఉంటుందని తెలిపారు. కానీ నామమాత్రంగా గరుసుతో ట్రాక్ వేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. పాఠశాల ఆవరణం కూడా గుంతలమయంగా మారిందన్నారు. కావున తక్షణమే స్పందించి పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు