చేనేత జాళి శాఖ ఏడి వరప్రసాద్ కు వినతి పత్రం అందజేసిన ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీరాములు
విశాలాంధ్ర- అనంతపురం : అనంత ఉమ్మడి జిల్లాల్లో వెంటనే సొసైటీ సంఘాలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత జాళి శాఖ ఏడి వరప్రసాద్ కు బుధవారం వినతి పత్రాన్ని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీరాములు, జిల్లా కార్యదర్శి పామిశెట్టి గోవిందు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనంతపూర్ జిల్లాలో ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు సొసైటీ ఏర్పాటు చేసుకుంటే సొసైటీ ద్వారా లోన్ ఇవ్వడం తెలియజేశారన్నారు. అనంతపూర్ జిల్లాలో 19 సొసైటీలు చేస్తే అది కూడా అధికారులు రెండవ వరకు చేయక అవినీతికి పాల్పడడం వల్ల ఆ సొసైటీలు రద్దు చేసే పరిస్థితి నెలకొంది అన్నారు. సొసైటీలను సంవత్సర కాలంలో చేయకపోతే చేనేత సభ్యులు ఒక్కొక్కరు వెయ్యి రూపాయల నుంచి రూ. 1500 వరకు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మరి ప్రభుత్వం చేనేతలకు ఆదుకుంటామని మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రూ. 36 వేలు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. గత వైకాపా ప్రభుత్వం 24 వేలు ఇవ్వడం జరిగిందన్నారు. కరెంటు 200 యూనిట్‌కు ఉచితంగా ఇస్తామని, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఎక్కడ నిర్వహించడం లేదన్నారు. ఏపీ రాష్ట్రంలో అనంత ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువమంది వివర్స్ ఉన్నారన్నారు. నిన్నటి రోజున ధర్మవరం చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. రోజురోజుకు వారి నేసిన చీరలు గిట్టుబాటు ధరలు లేక ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక అప్పులు చేసిన చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదన్నారు. చేనేత కార్మికులు బతుకుతెరువు కోసం పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారన్నారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా సొసైటీలు ఏర్పాటు చేయాలని సొసైటీ ద్వారా చేనేత కార్మికులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అలిపిర , చేనేత కార్మికులు కే మల్లికార్జున, సి ఎర్రి స్వామి, పి చంద్రశేఖర్, సి భార్గవ, ఎస్ వెంకటరమణ, శ్రీ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


