ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు వద్దు.. నేడు బిగిస్తున్నారు.
విశాలాంధ్ర – జేఎన్టీయూ (అనంతపురం): అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టాలని చెప్పిన పెద్దమనిషి అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లను ఎవరైనా బిగించడానికి వస్తే ప్రజలు వాటిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. కే రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కే రామకృష్ణ మాట్లాడుతూ..పాలకుల అస్తవ్యస్థ పాలనలో ఏపీ రాష్ట్రంలో అప్పులు అధికమని అభివృద్ధి శూన్యమన్నారు. ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు పెంచడం లేదని చెప్పి ఈ కాలంలోకి రాగానే ఆరు నెలల వ్యవధిలో రూ. 15వేల, 480 కోట్లు ట్రిప్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో ప్రధానమంత్రిని, హోం మంత్రి,ఆర్థిక మంత్రులను కలిసి అర్జీలు ఇవ్వడమే తప్ప ఒరిగిందేమి లేదన్నారు టిడిపి ఏడాది పరిపాలనలో ఎటువంటి మార్పు రాలేదని వైసిపి విధానాలనే అవలంబిస్తున్నారన్నారు. రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏది సాధించారో చెప్పాలన్నారు. విభజన హామీలు, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కడప స్టీల్ ప్లాంట్ ల గురించి వీటిపై ఏమీ మాట్లాడడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి జిందాల్ అంటే చంద్రబాబునాయుడు జిందాల్ అంటున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పక్కాగా ప్రవేట్ వారికి అప్పగిస్తుంటే దానిని ఆపలేకపోతున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 4 వేలు మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడంతోపాటు 1,400 మంది పర్మినెంట్ కార్మికులకు వ వీఆర్‌ఎస్ ఇచ్చి పంపించడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 45.72 మీటర్ల ఎత్తు నిర్మాణం జరిగితేనే పూర్తిస్థాయిలో నీటిని వినియోగించడం జరుగుతుందన్నారు. తద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు నీరు అందించడం వీలుంటుంది అన్నారు. అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఒక సంవత్సర కాలంలో రూ. 1,50, వేల కోట్ల అప్పులు చేయడం జరిగిందన్నారు. ఒక అమరావతి రాజధాని నిర్మాణం కోసం 31 వేల కోట్లు తప్పు చేశారని మరో 31 వేల కోట్ల రూపాయలు అప్పులు తేవడానికి సిద్ధమయ్యారన్నారు. సింగపూరు ఢల్లీి పర్యటనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారా లేక అప్పుల్లోకి తీసుకుపోతున్నారో విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అప్పులు ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల కాలంలో రూ.37 వేల కోట్లు అప్పుల పాలు చేసిందన్నారు. రాష్ట్రంలో మన టార్గెట్ రూ. 79 వేల కోట్లు ఉంటే రూ. 37 కోట్లు అప్పు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై సమగ్రమైన చర్చలు జరగాలన్నారు.
3500 కోట్ల మద్యం దోపిడీని రికవరీ చేయాలి
మద్యం కుంభకోణంలో 3500 కోట్లు గత ప్రభుత్వం దోపిడీ చేశారని కూటమి ప్రభుత్వం చెబుతున్నారు , 12 మందిపై కేసులు పెట్టారు. అరెస్టు చేసిన వారిపై నిజాలను నెగ్గు తేల్చకుండా.. సిట్, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో కాలగర్భంలో కలిపేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కేసులు పెడతారు జైలుకు వెళతారు, బయలు తీసుకుని బయటికి వచ్చి.. ఏ తప్పు చేయలేదని చెప్తారు.. దర్యాప్తు సమస్యలపై ప్రజలకు విశ్వసనీత లేకుండా పోతుందన్నారు. నిజాలను నెగ్గు తెలిసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజాధనాన్ని రికవరీ చేయాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి వేమయ్య, అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, జిల్లా సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు జె. రాజారెడ్డి, అనంతపురం నగర సిపిఐ కార్యదర్శి ఎన్ శ్రీరాములు, పాల్గొన్నారు.


