విశాలాంధ్ర – నిడదవోలు :
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టుకు నిడదవోలు వాస్తవ్యులు అయితం కనకయ్య,లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు సత్యనారాయణ,రాధిక. గంగాధర, భవాని.శివయ్య, కుమారి లక్ష రూపాయలను విరాళంగా అందజేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్య నిర్వహణ అధికారి వి.హరి సూర్యప్రకాష్ ప్రకటనలో తెలిపారు. భక్తుల సందర్శనర్థమే శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసారు. ఆదివారం భక్తుల ద్వారా దర్శనం రూ 30,560లు అన్నదానం రూ 1,02,270 లు,ప్రసాదం 24,800లు,ఇతరటికెట్స్ రూ 43,636లు,మొత్తము రూ 2,01,266లు ఆదాయం లభించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యర్థమై చేసిన ఏర్పాట్లను ఫౌండరు ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వీకే ఏ శర్మ, ఆలయ సూపరింటెండెంట్ పి. శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు


