విశాలాంధ్ర -అనంతపురం : వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ తెలుగు నాడు మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక శ్రీనివాసనగర్ నందు ఉన్న యూనియన్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ… వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి 12వ పిఆర్సి కమిటీని వెంటనే నియమించి 90 శాతం ఐ ఆర్ ప్రకటించాలని పేర్కొన్నారు. ఉద్యోగులు బకాయిలు విడతల వారీగా చెల్లించాలని పెండింగ్ లో ఉన్న డి .ఏ లు వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖలో గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన 143 జీవో ని వెంటనే రద్దు చేయాలని సీనియర్ ఏఎన్ఎంల రీ డిప్లయ్మెంట్ రద్దుచేసి యధా స్థానాలకు పంపాలని, వారి కి ఏఎన్ఎం నుండి జిఎన్ఎమ్ ప్రమోషన్లను కల్పించి 115 జీవో ని అమలు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎఫ్ టి ఏ రెగ్యులర్ గా చెల్లించేటట్లు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. 2024లో రెగ్యులర్ అయిన ఎం. పి .హెచ్ .ఎ (మగ) వారికి ప్రొహిబిషన్ పిరియడ్ రెండు సంవత్సరాలకు తగ్గించి సూపర్వైజర్ ప్రమోషన్లను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ముఖ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు డి.మల్లికార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి పైడి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు నాగ శంకర్, కార్యవర్గ సభ్యులు ప్రకాష్, పుల్లా కిరణ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
- Advertisement -
RELATED ARTICLES


