Homeఆంధ్రప్రదేశ్స్మార్ట్ మీటర్స్ బిగించరాదు… విద్యుత్ ఛార్జీలు పెంచరాదు..

స్మార్ట్ మీటర్స్ బిగించరాదు… విద్యుత్ ఛార్జీలు పెంచరాదు..

- Advertisement -

సిపిఐ,సిపిఎం పార్టీ నాయకుల డిమాండ్
విశాలాంధ్ర- ధర్మవరం : ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించరాదని విద్యుత్ ఛార్జీలను పెంచరాదని సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని
సిపిఎం పార్టీ ఆఫీస్ నందు విలేకరులతో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పెద్దన్న, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం. మధు, సిపిఎం సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష ,పట్టణ కార్యదర్శ లు ఏ మారుతి, రవి, సిఐటియు నాయకులు జె వి రమణ, అయూబ్ కాన్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు ఈనెల 5వ తేదీన పట్టణంలోని విద్యుత్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించరాదని పేద , మధ్య తరగతి కుటుంబం ల పైన, రైతుల పైన విద్యుత్ ద్వారాలు పెంచరాదని తెలిపారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునకు రాజకీయ ఎన్నికల ప్రచారాల సందర్భంగా వైయస్సార్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించి రైతులకు ప్రజలకు మోయ లేని భారాలు వేసి, గతంలో బాదుడే బాదుడని నినాదాలతో రైతులకు ప్రజలకు మా అధికారం రాగానే బిగించిన స్మార్ట్ మీటర్లను తొలగిస్తామని ,అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని నారా లోకేష్ , సీఎం చంద్రబాబు పిలుపునివ్వడం జరిగినదని, కానీ అధికారం వచ్చి సంవత్సరం పైబడిన గతంలో బిగించిన స్మార్ట్ మీటర్లు తొలగించలేదు అని మండిపడ్డారు. అదేవిధంగా ఇప్పటికే పట్టణాలలోని అనేక షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించి, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అనేక రకాలు ఇబ్బందులకు గురవుతుంటే మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు మరింతగా భారంపడేటట్లు స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నదని, చెప్పిన హామీలు ఎక్కడికెళ్ళినాయని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో బాదుడే బాదుడు అన్న నినాదాలు ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాదుడే బాదును అమలు చేస్తున్నదని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో పెంచిన విద్యుత్ చార్జీలను ఈ ప్రభుత్వం సంవత్సరంలోపే పెంచి రైతులకు ,ప్రజలకు మోయలేని భారం వేసినదని మండిపడ్డారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం మానుకోవాలని, బిగించిన స్మార్ట్ మీటర్లు తొలగించాలని ఆ విధంగా కాని పక్షంలో వామపక్ష పార్టీలు ప్రజలను ,ప్రజా సంఘాలను కలుపుకొని ప్రభుత్వం పైన పెద్ద ఒత్తిడి తీసుకొని వస్తామని ,గతంలో విద్యుత్ ఛార్జీలు పైన చేసిన పోరాటాలు పునరావృతం అవుతాయని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు హెచ్చరించారు.కావున ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు వ్యాపారస్తులు కలసి రావాలనిఈనెల ఐదున జరగబోయే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని వారుపిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు