విశాలాంధ్ర శింగనమల..పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పుట్లూరు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద
నిరసన చేపట్టారు, అనంతరం విద్యుత్ అధికారులకు మెమో రాండం అందించారు. ఈ సందర్భంగా
పుట్లూరు మండల సిపిఐ, సిపిఎం పార్టీల మండల కార్యదర్సులు డి, పెద్దయ్య, , సూరి లు మాట్లాడుతూ!
రాష్ట్ర ప్రభుత్వం పెంచినవిద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ సంవత్సరంలోనే 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీలను అదనంగా ప్రజలపై భారం మోపారు. ఇప్పుడు మరో 12,700 కోట్లు భారాన్నిమోపడానికి సిద్ధం చేసిందని,మొత్తం నాలుగు రకాల సర్దుబాటు చార్జీలు ఎఫ్, పి,పి, సి,ఏ వసూలు చేస్తున్నారన్నారు. దీనితో బిల్లులు అధికంగా వస్తున్నాయని,స్మార్ట్ మీటర్లు బిగించి అనంతరం షాపులు, చిన్న పరిశ్రమలు రెండు, మూడు రెట్లు, కొందరికి పదిరెట్లు చార్జీలు పెరిగాయన్నారు. మరో 842 కోట్ల భారాన్ని మోపడానికి ఈ, ఆర్, సి, అనుమతి కోరిందన్నారు.
మీటర్లకు అయ్యే ఖర్చు 10- 17 వేల వరకు 93 నెలల పాటు ప్రతి నెల బిల్లులో కలిపి మనపై మావడం మరింత దారుణమన్నారు. అధిక విద్యుత్ వినియోగించే సమయాలలో అధిక రేట్లు నిర్ణయించి వసూలు చేయడం అన్యాయమని, ఫ్రీ పెయిడ్ మీటర్ల వల్ల అందరిపై అధిక భారం పడుతుందని, కరెంట్ బిల్లు ఆన్లైన్లో పంపడం వల్ల బిల్లులకు జవాబుదారీతనం ఉండదన్నారు అందుకే ఆదరణ స్పాట్ మెటల్ విద్యుత్ వినియోగదారులకి నష్టం జరుగుతుందని , సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. ఇండ్లకు స్మార్ట్ మెటల్ బిగించడాన్ని ఆపాలని, పాత మీటర్లను కొనసాగిస్తూ, పాత రీడింగ్ పద్ధతిని అమలు చేయాలన్నారు. గృహాలకు స్పాట్ మీటర్లు పెట్టవద్దని, షాపులకు సంస్థలకు పెట్టిన మీటర్లు తొలగించాలని, చార్జీలు పూర్తి రద్దు చేసి బిల్లులు తగ్గించాలని, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోమండల సహాయ కార్యదర్శి, రాజు, బాలు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి టీ పెద్దయ్య, పెద్దన్న, భూషణం, సురేంద్ర, నడిపి నారాయణ, కే చిన్నారెడ్డి,జె, పెద్దయ్య, వి కుల్లాయప్ప, బాల ఓబులేసు, దేవరాజు, బి, భాస్కర్ రెడ్డి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్ల బిగింపు రద్దు చేయాలి
- Advertisement -


