Homeజిల్లాలుతూర్పు గోదావరిపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సేవలు అభినందనీయం

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సేవలు అభినందనీయం

- Advertisement -

విశాలాంధ్ర- దేవరపల్లి- పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సేవలు వెలకట్టలేనివని పంచాయతీలకు వారు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని దేవరపల్లి జడ్పిటిసి పొట్టి స్వర్ణలత సర్పంచ్ కడిమి వీర కుమారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద పారిశుధ్య కార్మికులకు పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయితీలలో పారిశుద్ధ్య నివారణకు కార్మికులు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయం అన్నారు ప్రతిరోజు గ్రామంలో చెత్త నివారణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు పంచాయతీ సిబ్బంది కూడా పంచాయతీ అభివృద్ధికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలకు కృషి చేస్తున్ననన్నారు వారు చేస్తున్న కృషి ని దృష్టిలో పెట్టుకుని వారిని ఈరోజు సన్మానించడం ఎంతో అభినందనీయమని అన్నారు పంచాయతీ కార్యదర్శి ఎన్ రవి కిషోర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి వారు చేస్తున్న సేవలు కృషి దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 15వ తేదీన వారిని సన్మానించడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడిమి రాజు పంచాయతీ సభ్యులు తంగేళ్ల సుబ్రమణ్యం రమాదేవి మాధవరపు ఇందిరా పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు