విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; 79 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రిటిషు వారు మన సంపదను , ఆత్మగౌరవాన్ని దోచుకుంటే, మన భారత పాలకులు భయాన్ని , బానిసత్వాన్ని , పేదరికాన్ని వారాసత్వంగా పాలిస్తున్నారన్నారు. నేటి పాలన ప్రజల కోసం కాదని,,. పెత్తందారుల కోసం . పెట్టుబడి దారుల కోసం మాత్రమే నన్నారు. సామాన్యులకు, అతి సామాన్యులకు నేటి పాలనలో హక్కులు లేవనీచ స్వేచ్చ లేదని, . పేదరికాన్ని , అస్పృశ్యతను, నిరంతర దారిద్య్రాన్ని జీవిత కాలం భుజాన వేసుకుని మోస్తూ,
ఇదే నేటి స్వాతంత్య్ర స్వేచ్చ అని సంబరపడుతున్నామన్నారు.
నేడు దేశాన్ని ప్రేమించలేని వారంతా పాలకులనీ, దేశం కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్దపడే వారంతా బానిసలుగా ఉంటున్నారని, ఇలాంటి ధోరణి ఒక్క భారత దేశంలో తప్ప మరెక్కడా కనిపించదన్నారు,
నేటి స్వాతంత్య్ర పాలనలో హక్కులు అమలు కావని, . పాలనలో అభివృద్ధి ఉండదని, . శాంతి భద్రతలు అస్సలు సాధ్యం కావని, అవినీతి నియంత్రణ అసాధ్యమని, . ఆడ బిడ్డలకు కనీస భద్రత లేదని, . విద్యా , వైద్యం సామాన్యులకు అసాధ్యమన్నారు. ఆ కారణంగానే నూతన ప్రజాస్వామ్య నిర్మాణం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదని చ అందుకోసం ప్రతి భారతీయుడు నేటి పెత్తందారి పాలకులకు వ్యతిరేకంగా నడిచే ఈ మహోన్నత పోరాటంలో భాగస్వాములుగా చేరి స్వాతంత్య్ర పోరాట కీర్తిని పొందాలని ఆయన పిలుపునిచ్చారు .
తొలుత ఆర్పిసి ప్రధాన కార్యాలయం దగ్గర మేడా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు . అనంతరం నేతాజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఆ మహా యోధుడి్ఇ జోహార్లు అర్పించారు. అనంతరం
జిల్లా కోర్టు ఎదుట , సీతంపేట , తుమ్మలావ , తాడితోట, క్వారి సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో మేడా శ్రీనివాస్ జాతీయ జెండా ను ఆవిష్కరించి దేశ భక్తి స్ఫూర్తిని నింపారు . స్థానిక మూలగొయ్యి వద్ద సిమ్మా దుర్గారావు ఆధ్వర్యంలో పిల్లలకు పెన్నులు, పుస్తకాలు పంపిణి చేసారు. తాడితోట వద్ద అలజంగి రాజు ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణి చేసారు ..
ఈ కార్యక్రమంలో అర్పిసి సెక్కులర్స్ డి వి రమణమూర్తి, పెండ్యాల కామరాజు, కొత్తపల్లి భాస్కరరామం , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , వాడపల్లి జ్యోతిష్ , గుడ్ల దుర్గా ప్రసాద్ , బసా సోనియా , చల్లా సాంబశివరావు, మేడా చిన్నారి , ద్వాదశి శ్రీనివాసరావు, మండవల్లి వెంకటేశ్వరరావు , జవ్వాది మోహన్, మండవల్లి సూరిబాబు , అడపా దేవుడు, ముగ్గళ్ళ రాజేష్ , అల్లాడ రమేష్ కుమార్ , ధర్మవరపు వెంకటేశ్వరరావు , కేతా అప్పారావు, మేడిచర్ల శ్రీనివాసరావు, వల్లి శ్రీనివాసరావు, రంకిరెడ్డి గణేష్, బత్తెన శివన్నారాయణ , కొల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు ..


