విశాలాంధ్ర – నిడదవోలు :
నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ భద్రందొర ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించిందని అటువంటి పార్టీలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని విస్మరించి ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ పాలన సాగిస్తున్నారని ఈ విధానం భవిష్యత్తులో భారతదేశానికి పెను ప్రమాదంగా మారుతుందని భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలు కావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సాధ్యంమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరలాల్, పెరవలి మండల అధ్యక్షులు బుద్ధన లక్ష్మణరావు, ఖాకీ కిషోర్, షేక్ నాగూర్, మహమ్మద్ అన్వర్ ఖాన్, పుచ్చకాయల ప్రసాద్, గుర్రం రమేష్, ఉంగులూరి వెంకన్న, షేక్ చినజిలాని, తివనాని వెంకటరమణ, రాము మహిళా నాయకురాలు దారపురెడ్డి సుజాత ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.


