Homeజిల్లాలుఅనంతపురంఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం..

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం..

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ :ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం మార్గాలను చూపడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ ( ఏపీజిఏ) సంఘం ప్రధాన లక్ష్యమని అనంతపురం జిల్లా సంఘం అధ్యక్షుడు గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి రాము నాయక్ పేర్కొన్నారు. శనివారం అనంతపురం జిల్లా సంఘం కార్యాలయంలో ఆ సంఘం యొక్క 7 వ వార్షిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కార్యాలయంలో జెండా ఆవిష్కరణ గావించి సంఘం నాయకులు సంయుక్తంగా జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోపికృష్ణ మాట్లాడుతూ. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయినప్పటికీ చాలా వరకు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని సుమారు రూ. 35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, పెన్షనర్ల పరిస్థితి మరింతగా దయనీయంగా మారిందని , సిపిఎస్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదని ప్రభుత్వం న్యాయపరంగా సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఉద్యోగ వర్గాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి వస్తే వాటినిపరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి రాము నాయక్,
మహిళ నాయకురాలు సాంబశివమ్మ, సుజాత… సిటీ యూనిట్ అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, ట్రెజరర్ మౌలా సాబ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, ఈశ్వరయ్య సింగనమల తాలూకా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు