Homeఆంధ్రప్రదేశ్ఘనంగా ఎపిజిఇఎ గుర్తింపు దినోత్సవం.--విల్సన్ పాల్.

ఘనంగా ఎపిజిఇఎ గుర్తింపు దినోత్సవం.–విల్సన్ పాల్.

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ఆగష్టు 16 వ తేదీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ గుర్తింపు దినోత్సవం పురస్కరించుకుని కడియం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వేడుకలు నిర్వహించారు. కెఆర్ సూర్యనారాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల సంక్షేమం మరియు సమస్యల గురించి నిరంతరం తపిస్తుందని, పోరాడుతుందని, సమస్యలను పరిష్కరిస్తుందని, నాలుగవ తరగతి ఉద్యోగి మొదలుకొని గ్రూప్ -1 అధికారి వరకు సభ్యులుగా ఉన్న సంఘం తమ సంఘమని, మరియు 58 ప్రభుత్వ శాఖల సమన్వయంతో కూడిన సంఘం ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరుపుటకు గుర్తింపు పొందిన సంఘం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని జిల్లా కార్యదర్శి విల్సన్ పాల్ తెలిపారు. అనంతరం సంఘ గుర్తింపు దినోత్సవ సందర్భంగా కేక్ ను కట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె సూర్య శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ తాలూకా యూనిట్ కార్యదర్శి పి మురళి కృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ టివి శ్రీధర్, తాలూకా నాయకులు కెఎన్ మూర్తి, వి ఉమామహేశ్వరి, అన్నపూర్ణ, ముఖ్య అతిధులుగా సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ జి మాధురి, డాక్టర్ ఎల్ మోహనవంశీ, డాక్టర్ కళ్యాణచక్రవర్తి మరియు సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన వేడుకలలో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి మాధురి ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ప్రతినిధి బృందం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు