Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం నుండి 10గేట్ల ద్వారా దిగువ సాగర్‌కు నీరు విడుదల

శ్రీశైలం నుండి 10గేట్ల ద్వారా దిగువ సాగర్‌కు నీరు విడుదల

- Advertisement -


విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎగువ కురుస్తున్న బారీ వర్షాలు, వదరల కారణంగా శ్రీశైలం జలాశయానికి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు జలాశయం నుండి 10 స్పిల్‌వే గేట్ల ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు.జలాశయానికి ఎగు హంద్రీ. జూరాల, సుంకేసుల నుండి 3,73,024 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో జలాశయం నుండి 10 స్పిల్‌వే గేట్లను 12 అడుగుల మేరా ఎత్తి దిగువ సాగర్‌కు 3,04,690 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు ఏపీ జలవిద్యుత్‌కు ప్రాజెక్టుకు 30,153 క్యూసెక్కులు, తెలంగాణ జలవిద్యుత్‌కు 35,315 క్యూసెక్కుల నీరు పోతిరెడ్డిపాడుకు 30,000 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 2818 క్యూసెక్కులు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, తదితర ప్రాజెక్టులకు 30,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు నుండి 4,02,976 క్యూసెక్కుల నీరు పోతుంది. జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంను 881.70 అడుగుల నీరు నిల్వ ఉంది.పూర్తి నీటిసామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 197.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తుం డటంతో ప్రాజెక్టు అందాలు తిలకించేందుకు పర్యాటకులు బారీ ఎత్తున చేరుకోవడంతో నల్లమల పారెస్టులో బారీ ఎత్తున ట్రాపిక్‌ ఇబ్బందులు ఏర్పాడ్డాయి. ట్రాపిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు