- Advertisement -
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:ఆలోచనలతో రండి.. పరిశ్రమకు వ్యక్తులుగా ఎదగండి అని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం జేఎన్టీయూ పాత పరిపాలన భవనంలో రతన్ టాటా ఇన్వెషన్ సెంటర్ ను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో ఎదుర్కొంటున్న విభిన్న సమస్యల పరిష్కారానికి విద్యార్థుల ఆలోచనలు.. వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. చెన్నారెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.


