Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబార్ లైసెన్స్ దారులు ఆరు సులభ పద్ధతిలో రుసుము చెల్లించాలి..

బార్ లైసెన్స్ దారులు ఆరు సులభ పద్ధతిలో రుసుము చెల్లించాలి..

- Advertisement -

అనంతపురం ప్రోహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం ప్రొహిబిషన్ పరిధిలోగల బార్ల లైసెన్సుదారులు ఆరు సులభ వాయిదాలలో రుసుమును చెల్లించాలని అనంతపురం ప్రోహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో నూతన బార్లకు సంబంధించిన విషయాలను పాత బార్ల లైసెన్స్ దారులకు, ఏ ఫోర్ షాప్ లైసెన్స్ దారులకు, కొత్తగా బార్లకు వేయదలచిన అభిలాష పరులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బార్ల లైసెన్స్ కొరకు పలు విషయాలను, వాటికి సంబంధించిన రుసుము వివరాలను తెలియజేశారు. ఇంతకు మునుపు బ్రీడింగ్ పద్ధతిలో ఉండేదని, కానీ నేడు ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ పద్ధతిలో రావడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అదనంగా మూడు గంటలు అనగా 10 గంటల నుండి 12 గంటల వరకు అధిక సమయం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇంతకు మునుపు ఏ ఈ ఆర్ టి ఎప్పటికప్పుడు చెల్లించే వారిని ప్రస్తుతం రెండు నెలల వరకు వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రెస్టారెంట్ ఉండవలసిన అవసరము లేదు అని, ప్రతి వ్యక్తి ఎన్ని దరఖాస్తులైన వేసుకోవచ్చునని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ధర్మవరమునకు సంబంధించి మూడు బార్లకు మున్సిపాలిటీకి మూడు కిలో మీటర్ల లోపు పెట్టుకొని అవకాశం రావడం జరిగిందని తెలిపారు. ప్రతి బార్ అప్లికేషన్ కు రూ .5,10,000 , ఒక సంవత్సరముకు గాను 55 లక్షలు గా ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈనెల 26వ తేదీ లోపల దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ప్రొహిబిషన్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ నరసింహులు, ధర్మవరం సిఐ చంద్రమణి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు