Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమంచి విద్యా బోధనతోనే అధిక ఉత్తీర్ణత శాతం లభిస్తుంది..

మంచి విద్యా బోధనతోనే అధిక ఉత్తీర్ణత శాతం లభిస్తుంది..

- Advertisement -

అక్కడ మీకు మానిటరింగ్ ఆఫీసర్ సలీం భాష
విశాలాంధ్ర ధర్మవరం;; మంచి విద్యా బోధనతోనే అధిక ఉత్తీర్ణతా శాతం లభిస్తుంది అని అక్కడ మీకు మానిటరింగ్ ఆఫీసర్ సలీం బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న విద్య, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, హాస్టల్ వసతులు, ఐఐటి, నీట్, విద్యాశక్తి తరగతుల గూర్చి వారు ఆరాధిశారు.. తదుపరి ఉపాధ్యాయులతో సమావేశాన్ని జరిపి పలు సూచనలను ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో చాలాచోట్ల తక్కువ రిజల్ట్ వచ్చిందని, అది పాఠశాలకే ముప్పు వాటిల్లుతుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ మోడల్ స్కూలుకు నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయుని కృషి చేయాలని, ప్రిన్సిపాల్ పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలని తెలిపారు. అదేవిధంగా తరగతి గదుల్లో విద్యార్థుల యొక్క నోటు పుస్తకాలను, వారు రాసిన పాఠ్యాంశాల తీరును వారు తనిఖీ చేశారు. తదుపరి కాసేపు విద్యార్థులతో విద్యా సమస్యల గూర్చి, వసతులు గూర్చి వారు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మశ్రీ తో పాటు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు