విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్యగుట్ట వద్ద గల ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సమీపంలో పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన పాల్యం ధనుంజయ (27 సంవత్సరాలు) బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని హత్య చేయబడిన స్థలాన్ని వారు పరిశీలించారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ధనుంజయ మెకానిక్ వృత్తి చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడని వన్టౌన్ సీఐ తెలిపారు. సిమెంటు ఇటుక పిల్లతో తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందడం జరిగిందని తెలిపారు. ఈ కేసును సీరియస్ గా తీసుకొని త్వరలోనే హత్య చేసిన వారిని పట్టుకుంటామని తెలిపారు. తదుపరి వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతునికి వివాహం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ద్వారా మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. హత్య గావింపబడ్డ ధనుంజయకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? పథకం ప్రకారం చేశారా? అన్న కోణంలో వన్ టౌన్ పోలీసులు విచారణలు వేగవంతం చేశారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెకానిక్ దారుణ హత్య.. వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్
- Advertisement -
RELATED ARTICLES


