Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఫ్రీ ఓల్డ్ భూముల నిషేధం పొడిగింపు పై సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు ఆగ్రహం

ఫ్రీ ఓల్డ్ భూముల నిషేధం పొడిగింపు పై సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు ఆగ్రహం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం/ ముదిగుబ్బ; రాష్ట్రంలో ఫ్రీ ఓల్డ్ భూముల పై నిషేధం మరో రెండు నెలలు పొడిగిస్తున్నామని బుధవారం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ముదిగుబ్బలో ఒక ప్రకటన ద్వారా స్పందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య, పేదరైతుల జీవితాలతో ఆడు కొంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత జులై నెల 5వ తేదీన జరిగిన రెవెన్యూ శాఖ సమావేశంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖ మంత్రి తోపాటు, సంబంధిత అధికారులతో ఫ్రీ ఓల్డ్ భూముల విషయమై మాట్లాడుతూ ఇప్పటికే ఫ్రీ ఓల్డ్ అయిన అర్హత కలిగిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో భాగంగా తుది జాబితా పూర్తి చేసి అక్టోబర్ 2వ తేదీ కల్లా వాటిపై నిషేధం ఎత్తివేసి తద్వారా ఇంతవరకు ఫ్రీ ఓల్డ్ కు నోచుకోని మిగిలిన అన్ని అర్హతలు కలిగిన అసైన్డ్ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అన్నారు. కాగా రెవెన్యూ శాఖ మంత్రి తో పాటు సంబంధిత ఉన్నత అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను విస్మరిస్తూ తిరిగి ఈ నిషేధం మరో రెండు నెలలపాటు పొడిగిస్తున్నామని రెండు రోజుల కిందట రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆదేశాలు జారీ చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఫ్రీ హోల్డ్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. మాజీ సీఎం జగన్ రాజకీయ లబ్ధి కోసమో, మంచికో చెడుకో 20 ఏళ్లు సీనియార్టీ కలిగిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్ చేసి వాటికి రిజిస్ట్రేషన్ సౌకరం కల్పించడం జరిగింది అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం
ఈ ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంలో గత వైసిపి ప్రభుత్వం భారీగా అక్రమాల కు పాల్పడిందని దర్యాప్తు చేపట్టి ఫ్రీ ఓల్డ్ అయిన మొత్తం 13 లక్షలు ఎకరాలలో ఏడు లక్షల ఎకరాలు మాత్రమే సవ్యంగా జరిగాయని మిగిలిన వాటిని నిబంధనలు విరుద్ధంగా చేశారని ఆరోపించిన విషయం తెలిసిందేనని తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ పేరుతో గత 15 నెలలుగా ఈ ఫ్రీ హోల్డ్ భూములపై విధించిన నిషేధాన్ని తరచూ పొడిగిస్తూ వస్తున్న ఎన్ డి ఏ ప్రభుత్వం సవ్యంగా జరిగాయని మీరు ఇప్పటికే గుర్తించిన ఏడు లక్షలు ఎకరాల పైన అయినా నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోనే విస్తీర్ణంలో పెద్ద మండలం గా పేరుగాంచిన ముదిగుబ్బ మండలంలో ఫ్రీ హోల్డ్ భూముల సమస్యతో పాటు 1954 ముందు ఉన్న వేల ఎకరాల పాత పట్టా భూములు కూడా 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చబడి చుక్కల భూములుగా నమోదయి, అవి కూడా దాదాపు 7 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ కు నోచుకోకుండా పోయాయన్నారు, ఈ పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందుల నడుమ తమ పాత పట్టా భూములను విక్రయించాలనుకున్న రైతన్నలు తోపాటు ఇంటి స్థలాల క్రయవిక్రయాలు చేయాలనుకున్న వారు కూడా తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ఫ్రీ ఓల్డ్ భూముల సమస్యతోపాటు మండలంలో దీర్ఘకాలికంగా నెలకొన్న పాత పట్టా భూముల రిజిస్ట్రేషన్ సమస్యను కూడా పరిష్కరించాలని ఆయన కోరారు, లేని పక్షంలో మండల రైతులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే పెద్ద ఎత్తున చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు