Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో నిరసన.. ఏపీటీఎఫ్

ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో నిరసన.. ఏపీటీఎఫ్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోనిప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా నల్ల రిబ్బన్నతో మొదటి రోజున నిరసన తెలపడం జరిగిందని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీందర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేశారన్నారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను ప్రభుత్వ వెంటనే ప్రకటించాలని, పి ఆర్ సి కమిషన్ నియమించి 30 శాతము ఐ ఆర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నాలుగు డీఏలను విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, ఐ ఆర్ ప్రకటించాలని, బకాయిల చెల్లింపుకై, హెల్త్ కార్డు పరిమితి పెంపుకై, అసెస్మెంట్ లు బుక్లెట్లు విధానం రద్దు చేయాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వివిధ నిరసన కార్యక్రమాలను విధిగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కావున ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఏపీటీఎఫ్ నిరసన వారమును జయప్రదం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు