విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని శాంతినగర్ లో గల డేరంగుల సరస్వతి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. వివరాలను కుటుంబ సభ్యులు, టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు డేరంగుల సరస్వతి కూలి పనులు చేసుకుంటూ తన దగ్గర ఉన్న పిల్లలను పోషిస్తూ చదివిస్తూ ఉండేదని తెలిపారు. ఇంట్లో దినచర్యలో భాగంగా తన ఇంటి పనులు చేసుకుంటూ కరెంటు మోటారును పక్కకు జరిపే సమయంలో అనుకోకుండా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు భర్త రాజశేఖర్ మూడు సంవత్సరాల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం తల్లి డేరంగుల సరస్వతి విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో ఆ కుటుంబం దుక్క సాగరంలో మునిగిపోయింది. మృతురాలికి జ్యోతి ఈశ్వర్ నిఖిల్ అనే కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో పిల్లలు అనాధలు అయ్యారు అని స్థానికులు తెలిపారు. ప్రభుత్వమే పిల్లలను ఆదుకొని చదివించాలని సానికులు బంధువులు కోరుతున్నారు.
విద్యుత్ షాక్ తో గృహిణి మృతి
- Advertisement -
RELATED ARTICLES


