విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన వైసిపి సీనియర్ నాయకులు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు.భాస్కర్ రెడ్డి గుండెపోటుతో మరణించడం భాధాకరంమన్నారు. జరిగిన సంఘటన వివరాలను తోపుదుర్తి భాస్కర్ రెడ్డి బార్య జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ కవిత ను అడిగి తెలుసుకున్నారు. తాను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుండి బాస్కర్ రెడ్డి పరిచయస్తుడని, సిపిఐ చేపట్టే రైతు ఉద్యమాలకు భాస్కర్ రెడ్డి సహకారం ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. . పరామర్శించిన వారిలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్, జిల్లా కార్యదర్శి పి.నారాయణస్వామి, సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్, జిల్లా సహాయ కార్యదర్శి జె. రాజారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, అనంతపురం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు, రామకృష్ణ, గోపాల్, కత్తినారాయణస్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.కుల్లాయిస్వామి, నగర అధ్యక్షులు మంజునాథ్ లు పరామర్శించిన వారిలో ఉన్నారు


