విశాలాంధ్ర పుట్టపర్తి:- జనగణనలో కులగణన త్వరగా పూర్తి చేయాలని సిపిఐ జాతీయ రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సాయి ఆరామoలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కుల గణన వీలైనంత త్వరగా రాష్ట్రంలో పూర్తి చేస్తేనే ప్రయోజనం చేకూరుతుందని ఆదిశగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కులగణన జరిగితేనే జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్ల వర్తింపు ఉంటుందన్నారు. బీసీలలో కూడా కొన్ని కులాలకు మాత్రమే రాజకీయంగా అవకాశం దక్కుతోందన్నారు .జనగణన చేయడం వల్ల ప్రభుత్వం ఆయా కులాల వారికి ఏం చేయాలి ఏ విధంగా వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నది తెలుస్తుందన్నారు. తెలంగాణలో మాదిరి ప్రభుత్వం జనగణనకు సంబంధించి నిర్ణయం త్వరగా తీసుకోవాలని ఆయన కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రి కులగణన త్వరగా పూర్తిచేసి నివేదిక పంపాలని ఆదేశించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల ప్రకారం కుల గణన చేపట్టి స్థానిక సంస్థలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు.బీసీ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వెనుకబడిన కులాల హక్కులను సాధించుకోవడానికి బీసీలు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.ఈ కార్యక్రమంలో హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ బి కే పార్థసారథి , సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ , వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కేటి శ్రీధర్ , బీసీ సంఘాల నాయకులు రమేష్ గౌడ్ , అంపావతిగోవిందు , జి చంద్రమోహన్ , బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య , ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు , చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి ,సిపిఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి మధు ,పెనుగొండ సిపిఐ నియోజకవర్గo నాయకులు శ్రీరాములు చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు లింగమయ్య, పుట్టపర్తి పట్టణ కార్యదర్శి వినోద్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సాముకోటి ఆదినారాయణ, బీసీ సంఘాల నాయకులు జయ చంద్రమోహన్,హిందూపురం పట్టణ కార్యదర్శి వినోద్, ఏ ఐ వైఫ్ జిల్లా కార్యదర్శి రాజా ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహేంద్ర, అన్ని ప్రాంతాల బిసి నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణలో మాదిరి ప్రభుత్వం కులగణన చేపట్టాలి..సిపిఐ నేత కె.రామకృష్ణ
- Advertisement -
RELATED ARTICLES


