Homeజిల్లాలుఅనంతపురంమహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోండి..

మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి: మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జెసి.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారము పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ వద్ద లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెసి.ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు, పిల్లలు చదువుకోవడానికి రుణాలు అందిస్తోందన్నారు. కావున మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే సంక్షేమాలను, రుణాలను సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం నిరుపేదలకు పీఎం స్వానిది కింద మంజూరైన ఏడు శాతం వడ్డీతో కూడిన రుణాల పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్లు తలారి అరుణ, షేక్షావలి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల మహిళలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు