విశాలాంధ్ర-అమడగూరు: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం లో భవనం పైకప్పు కూలి మంజుల వెంకటరమణ అనే వృద్ధుడు మృతి చెందాడు.మంజుల వెంకటరమణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కూలి నిమిత్తం పాత భవనం తొలగించడానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు భవనం పైకప్పు కూలి బరువైన రాతిదూలం మీద పడడంతో రెండు కాళ్లు, చేతులు, నడుము కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వెంకటరమణ ను కదిరి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారని తోటి కూలీలు, బంధువులు తెలిపారు. మృతునికి భార్య నాగమ్మ, కుమార్తె ఉన్నారు,కుటుంబ యజమానిని కోల్పోవడంతో భార్య,కూతురు కన్నీరు మున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు, కూటమి ప్రభుత్వ నాయకులను కోరారు.
భవనం పైకప్పు కూలి వృద్ధుడు మృతి….
- Advertisement -
RELATED ARTICLES


