Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానవతా సంస్థను ప్రజలకు మరింత సేవలు అందించేలా అందరూ సహకరించాలి

మానవతా సంస్థను ప్రజలకు మరింత సేవలు అందించేలా అందరూ సహకరించాలి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మానవతా సంస్థ ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించేలా అందరూ తమ సహాయ సహకారాలు అందించినప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కార్యదర్శి సాయి ప్రసాద్, ఉపాధ్యక్షులు మంజునాథ్, కోశాధికారి సల్లా చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని త్రిలింగేశ్వర ఆలయం పేట బసవన్నకట్ట వీధి నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా కుటుంబ సభ్యులు అధికంగా పాల్గొనడం విశేషం. తదుపరి పట్టణములో మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు. తదుపరి రిటైర్డ్ ఉపాధ్యాయులు శేఖర్ను సంస్థ తరఫున ఘనంగా సన్మానించారు. మానవతా సంస్థలు మరింత విస్కృత పరిచేందుకు అందరూ కృషి చేస్తూ తమ సహాయ సహకారాలను అందించాలని కమిటీ కోరింది. ఈ కార్యక్రమంలో జింక చిన్నప్ప, గాజుల సోమేశ్వర్ రెడ్డి, మనోహర్ గుప్తా, రవికుమార్, పళ్లెం జనార్దన్, సభ్యులు జనార్ధన్, నాగేష్, ఉపాధ్యాయులు, ఇంకనూ 50 మంది వరకు ప్రజలు పాల్గొనడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు