శ్రీ గీత భక్తమండలి సభ్యులు దేవత వెంకట నాగరాజు
విశాలాంధ్ర ధర్మవరం:: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడే చక్కటి మనశ్శాంతి లభిస్తుందని శ్రీ గీతా భక్తమండలి సభ్యుడు దేవతా వెంకట నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కళాజ్యోతిలో కళాజ్యోతి వారి సౌజన్యంతో శ్రీ వాల్మీకి రామాయణం క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాజ్యోతి గౌరవ సలహాదారుడు సింగనమల రామకృష్ణ, పిన్ను రామకృష్ణ ప్రసాద్, కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ క్విజ్ పోటీలకు న్యాయమూర్తులుగా దేవతా కృష్ణమూర్తి దేవత వెంకట నాగరాజు వ్యవహరించారు. ఈ కూచి పోటీలకు 80 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వాల్మీకి రామాయణం క్విజ్ పోటీలలో 9 ప్రశ్నలకు సమాధానాలు ఎవ్వరూ చెప్పలేకపోయారు. తదుపరి 8 ప్రశ్నలు ఏడు ప్రశ్నలు ఆరు ప్రశ్నలు ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది. ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం సమాధానముకు సమయం ఇవ్వడం జరిగిందని తెలిపారు. పాల్గొన్న 80 మందికి బహుమతులను ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్విజ్ పోటీలలో కే. సాయి వాసవి, మధుర మీనాక్షి, షేక్ యాక్సిన, హేమంత్, ఖ్యాతి శ్రీవాణి లకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నక్కల వెంకటేశులు, రంగస్వామి, పోష నాగరాజు, బద్దెల రమణ ,సోమశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి..
- Advertisement -
RELATED ARTICLES


