Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంతర కళాశాల కబడ్డీ పోటీలకు ఎంపిక

అంతర కళాశాల కబడ్డీ పోటీలకు ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణానికి చెందిన కె.మణిదీప్ అంతర కళాశాల పోటీలకు ఎంపికైనట్లు కబడ్డీ కోచ్ పృథ్వి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కళాశాల నందు మూడో సంవత్సరం చదువుతున్న మణిదీప్ ,ఈనెల 25వ తేదీన అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించినటువంటి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ జట్టుకు ఎంపిక రావడం జరిగిందన్నారు. ఎంపిక ఐన క్రీడాకారుడ్ని మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు , ఆర్డిటి ఏటీ ఎల్ శ్రీనివాసులు, కోచ్ లు అనిల్, రాజశేఖర్, పృథ్వీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు