Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచికిత్స పొందుతూ విద్యార్థి మృతి

చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని లింగిశెట్టి పాలెం లో గల ఓబులేసు కుమారుడు నితిన్ (12) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలకు వెళితే
పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో శనివారం ఉదయం పట్టణములోని లింగిశెట్టి పాలెం ఓబులేసు కుమారుడు 12 సంవత్సరాలు వయసుగల నితిన్ ఓ ద్విచక్ర వాహనంలో లిఫ్టు తీసుకొని కళాజ్యోతి సర్కిల్ కి రాగా, అనుకోకుండా మరో టూవీలర్ ఢీకొనగా, సీటు వెనకాల ఉన్న నితిన్ హఠాత్తుగా నేల కిందకు పడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలోని వైద్యులు వైద్య చికిత్సలు అందించారు. కానీ తీవ్రంగా వాంతులు రావడంతో, అప్పటికే అపస్మార్క స్థితిలో ఉన్నారని వైద్యులు తెలిపారు. తదుపరి సోషల్ మీడియాలో నితిన్ ఫోటో రావడంతో, అబ్బాయి చిన్నాన్న గుర్తుపట్టి, వారి తాతకు సమాచారం అందించడంతో, తాత తో పాటు నితిన్ మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం కు పంపించడం జరిగిందని వైద్యులు తెలిపారు. అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు మృతి చెందడం జరిగిందని అక్కడి వైద్యులు తెలిపారు. తదుపరి వన్ టౌన్ పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తదుపరి వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు