విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని యాదవ వీధికి చెందిన గూడూరు సరోజమ్మ (80 సంవత్సరాలు) నేతదానం చేయడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబం వారికి నేత్రదానంపై తాము అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వారి అంగీకార మేరకు నేత్రదానాన్ని స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లా అంతత్వ నివారణ సంస్థ అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ కుల్లాయప్ప ,కంటి ట్రావెల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర చేరుకొని నేత్రదానాన్ని సేకరించారు. నేత్రదానానికి సహకరించిన కుమార్తెలు నాగవేణి, శ్రీదేవి, మంజుల, కైలాష్, మనవరాలు స్నేహదీపిక, దీక్షిత, మనవడు నిఖిల్, నిఖిలేశ్వర్ కు విశ్వదీప సేవా సంఘం వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వదీపా సేవా సంఘం గాజుల సురేష్ ,ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, జూజారు రఘు తదితర సభ్యులు పాల్గొన్నారు.
నేత్రదానం చేసిన గృహిణి సరోజమ్మ
- Advertisement -
RELATED ARTICLES


