Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన గోరకాటి పురుషోత్తం రెడ్డికి సన్మానం

రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన గోరకాటి పురుషోత్తం రెడ్డికి సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమతులైన ధర్మవరం కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తం రెడ్డిని వైయస్సార్సీపీ నాయకులు వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సహకారంతో పట్టణానికి చెందిన గోరకాటి పురుషోత్తం రెడ్డికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. గోరకాటి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డ్ వైయస్సార్సీపీ ఇన్చార్జ్ గూండా ఈశ్వరయ్య, నాయకులు పల్లా రామాంజి, నారాయణస్వామి, దాసరి రాము, మహేష్, షాకీర్ ,నూర్ మహమ్మద్, నరేష్, శీన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు