Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రంలో మద్యం ఏరులా పారుతుంది..

రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతుంది..

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు నకిలీ మద్యం వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా ధర్మవరంలో కూడా కల్తీ మద్యం అధికంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మద్యం కుటీర పరిశ్రమగా మారిందని వారు మండిపడ్డారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని వారు తెలిపారు. కల్తీ మద్యం తాగి ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైన్ షాపులు పర్మిట్ రూములు బార్లు బెల్ట్ షాపులలో ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి దీని వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే వైయస్సార్సీపి చూస్తూ ఊరుకోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్సీపీ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు