విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం అంతకాపల్లి మొగిలివలస గ్రామానికి చెందిన ఎంపీటీసీ బౌరోతు కాంతారావు మాతృమూర్తి బౌరోతు పెద్దిమ్మీ ఇటీవలి కాలంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డా. రాజేష్ , బౌరోతు కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, వారి దుఃఖంలో పార్టీ తరఫున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికీ తీరని లోటని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజాం రూరల్ పార్టీ అధ్యక్షులు లావేటి రాజగోపాల్ నాయుడు, జడ్పీటీసీ బండి నరసింహులు, సర్పంచ్లు వాకముళ్ళ చిన్నం నాయుడు, వంజరాపు విజయ్ కుమార్, లెంక దామోదర్ నాయుడు, జిల్లా కల్చరల్ విభాగం అధ్యక్షులు డా. బి. నరేంద్ర, లంక గణనాథ, డబ్బాడ గణనాథ, లంక వెంకటరమణ, లంక తాతప్పల నాయుడు, వంజరాపు వెంకటరమణ, పెదలంక శ్రీనివాసరావు, లంక దాము, ఆబోతుల సీతారాం తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ రాజేష్ పరామర్శ
- Advertisement -


