- Advertisement -
విశాలాంధ్ర -ధర్మవరం ; కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో కాలేజీ సర్కిల్ నుండి ఎర్రగుంట సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఆర్టీవో రాణి, పుట్టపర్తి ఇన్కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ చందు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగంలోనూ, వాణిజ్య పన్నుల విభాగంలో 28 శాతం నుండి 18 శాతానికి జీఎస్టీ తగ్గింపు జరిగిందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు వాహనదారులు వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణములోని రవాణా షోరూం యాజమాన్యం, సిబ్బంది, ఆర్టీవో సిబ్బంది పాల్గొన్నారు.


