మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన మాజీ ఎమ్మెల్యే
విశాలాంధ్ర ధర్మవరం:: మంచినీటి సమస్యకు ధర్మవరమునకు శాశ్వత పరిష్కారం చూపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి వారి స్వగృహంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు ఘనంగా గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ సహకార దర్శి దేవరకొండ రమేష్, రూరల్ అధ్యక్షులుగా కొనుటూరు గోపాల్ కు పదవులు రావడానికి సహకరించిన కేతిరెడ్డికి తాము ఎంతో రుణపడి ఉన్నామని వారు తెలిపారు. మేము పార్టీ కోసం చేసిన సేవలు గుర్తించి మాకు ఈ పదవులు రావడానికి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అని వారు కొనియాడారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు గరుడపల్లి నారాయణస్వామి, బడనపల్లి నరసింహులు, గజ్జల శివ, గుజ్జల బొమ్మన్న, వెంకటరమణ స్వామి, దేవరకొండ చండ్రరాయుడు, విజయ్ కుమార్, రాఖీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఘన సన్మానం
- Advertisement -
RELATED ARTICLES


