విశాలాంధ్ర – తాళ్లపూడి : ఉపాధ్యాయులు, ఉద్యోగుల కొరకు ప్రభుత్వం విడుదల చేసిన కరువు భత్యం ఉత్తర్వులు 60, 61 లలో వాయిదాల చెల్లింపులోను, రిటైర్ ఉద్యోగుల పట్ల చూపిన వివక్షతను తొలగించి సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దున్నా దుర్గారావు, పి సువర్ణరాజులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటికే నాలుగు కరువుభత్యం కిస్తీలు పెండింగులో ఉంచి ఇచ్చిన ఒక డి.ఏ ఎరియర్ చెల్లింపు కూడా తీవ్రమైన జాప్యం ప్రదర్శించడం సహేతుకం కాదని అన్నారు. డి.ఏ ద్వారా లభించే ఎరియర్ లను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత చెల్లిస్తాననడం ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడమే అని వారు చెప్పారు. అంతేకాకుండా రిటైర్ ఐన వారికి 2027…2028 ఆర్ధిక సంవత్సరంలో 12 వాయిదాల్లో చెల్లిస్తామని జీ ఓ లో పేర్కొనడం తగదని వెంటనే జీ ఓ లు సవరించి ఏరియర్లు పి ఎఫ్ ఖాతాలో జమ అయ్యేవిధంగా, రిటైర్ ఐన వారికి తక్షణమే నగదు చెల్లించే విధంగా జీ.ఓ లు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తున్నట్లు దుర్గారావు, సువర్ణరాజులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిటైర్ ఐన ఉద్యోగులకు ఎటువంటి ఆర్థిక బకాయిలు పెట్టరాదని అన్నారు.
కరువుభత్యం జీ ఓ లు సవరించాలి….ఏపీటీఎఫ్
- Advertisement -
RELATED ARTICLES


