Homeఆంధ్రప్రదేశ్250 మందికి ఉచిత వైద్య శిబిరం సేవలు

250 మందికి ఉచిత వైద్య శిబిరం సేవలు

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ గల సాధన మహిళ మండలి ఆశ్రమంలో మంగళవారం 250 మందికి ఉచిత వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా సాధన మహిళ మండలి చైర్మన్ సుజ్ఞాన కుమారి మాట్లాడుతూ రాజమండ్రి గౌతమి నేత్రాలయం, రమా డెంటల్ కేర్, మధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, దంత పరీక్షలు, స్త్రీ శిశు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 250 మందికి సేవలను అందించడంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ  చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.  

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు