Homeఅంతర్జాతీయంఆర్యవైశ్యులకు ప్రపంచ స్థాయి గుర్తింపునుతెస్తా.. మద్దుల

ఆర్యవైశ్యులకు ప్రపంచ స్థాయి గుర్తింపునుతెస్తా.. మద్దుల

- Advertisement -

 విశాలాంధ్ర – కొవ్వూరు :  ఆర్యవైశ్యులకు ప్రపంచ స్థాయి గుర్తింపునుతెస్తానని ప్రపంచ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపికైన మద్దుల వీర వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొవ్వూరు విచ్చేశారు. ఈ సందర్భంగా ఈయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన తాను ప్రపంచ స్థాయి ఆర్యవైశ్య సంఘానికి ఎంపిక కావటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.ఈ పదవితో సంఘానికి సేవలందిస్తానని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం మంగళగిరిలో జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారన్నారు.

 మద్దుల ప్రస్థానం ఇలా..  కొవ్వూరు కు చెందిన మద్దెల వీర వెంకట సత్యనారాయణ న్యాయ శాస్త్రంలో పట్టా సాధించారు. అనంతరం కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ప్రపంచ స్థాయి ఆర్యవైశ్య సంఘం స్థాయికిఎదిగారు. అటు తర్వాత జిల్లా స్థాయిలో అనేక సేవలు అందించారు. ఆర్యవైశ్యులలో అజాతశత్రువుగా పేరొందిన ఈయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. టిడిపి పట్టణ అధ్యక్షుడిగా ప్రారంభమైన ఈయన రాజకీయ జీవితంలో అనేక పదవులు పొంది నేటికీ పార్టీకి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ను ఆర్యవైశ్య సంఘాల నాయకులతో పాటు రాజకీయ ప్రముఖులు పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు