Homeఆంధ్రప్రదేశ్అనధికారికంగా ఇసుక, బొండు మట్టి తోలకాలు 

అనధికారికంగా ఇసుక, బొండు మట్టి తోలకాలు 

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: నిబంధనలకు విరుద్ధంగా యద్దేచగా అనధికారికంగా ఇసుక, బొండు మట్టి తోలకాలు జరుపుతున్నారు. మండలంలో రాత్రింబవళ్ళు తేడా లేకుండా అక్రమార్కులు సీతానగరం కైలాసగిరి ర్యాంపు నుంచి రాత్రులు ఇసుక, పగలు బొండు మట్టి తోలకాలు తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ తోలకాలు జరుపుతున్న ట్రాక్టర్లు మితిమీరిన వేగంగా ప్రయాణిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఒక పక్క అనుమతులు లేని ఇసుక తరలింపుల పై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన జారీ చేస్తున్న క్షేత్రస్థాయిలో అనధికారిక మట్టి, ఇసుక తరలింపులపై ఎటువంటి చర్యలు ఉండడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అనధికారిక తరలింపు లపై సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు