Homeఆంధ్రప్రదేశ్ప‌వ‌న్ జోలికి వ‌స్తే ఖ‌బ‌డ్దార్‌

ప‌వ‌న్ జోలికి వ‌స్తే ఖ‌బ‌డ్దార్‌

- Advertisement -


—  ఎమ్మెల్యే బ‌త్తుల బ‌ల‌రామ కృష్ణ‌

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి ;  కందుకూరు ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై   రూమర్స్ సృష్టిస్తే ఊరుకునేది లేద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోలికి ఎవ‌రు వ‌చ్చినా జ‌న‌సైనికులు స‌హించ‌ర‌ని రాజాన‌గ‌రం ఎమ్మెల్యే బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ట ఫైర్ అయ్యారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం రాజ‌మండ్రిలోని ఆయ‌న నివాసంలో  ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ,  కందుకూరు ఘటన వైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపాదించడం దారుణ‌మ‌న్నారు. పవన్ జోలికి వస్తే వైసీపీ ఇంకా అదఃపాతాళానికి  వెళ్లి పోతుందన్నారు.  గతంలో కూడా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా  టార్గెట్ చేశారన్నారు.  వ్యక్తిగత కారణాలతో కందుకూరు ఘటన   జరిగిందని, దానికి హత్యపై పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశార‌న్నారు. అయితే వైసీపీ నాయకులు అంబటి, జక్కంపూడి రాజా,  వంగవీటి నరేంద్ర కందుకూరు వెళ్లి రాజకీయం  చేశాద‌ని విమ‌ర్శించారు.  కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి  జక్కంపూడి రాజా ఏం చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  దళితుడిని చంపిన వ్యక్తిని జక్కంపూడి రాజా
భుజాలపై కి ఎక్కించుకున్నాడని, దళితుడిని చంపితే నాడు వైసీపీ నాయకులు   ఎందుకు స్పందించలేదన్నారు . కాపుల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో కాపులను ఎవరూ విడదీయ లేరన్నారు. కాపులు, కమ్మ మధ్య విభేదాలు ఎప్పుడూ లేవని, గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ కాపు, కమ్మల‌ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పై కాపు నాయకుడు అనే ముద్ర వేయాలని చూస్తున్నారని, అన్ని కులాలు ఓట్లు వేస్తేనే ప‌వ‌న్  డిప్యూటీ సీఎం అయ్యారన్నారు.  కూటమిగానే మరో మూడుసార్లు ఎన్నికలకు వెళ్తామ‌ని, తాము మ‌రో ప‌దిహేనేళ్ళు అధికారంలో ఉంటామ‌ని బ‌త్తుల అన్నారు. ఇప్ప‌టికైనా వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికైనా శ‌వ రాజ‌కీయాలు మానుకోవాల‌ని , కుట్ర‌లు కుతంత్రాల‌కు దూరంగా ఉండాల‌న్నారు. వైసీపీ హ‌యాంలో కాపులు అణ‌చి వేత‌కు గుర‌య్యార‌ని, కాపులు ఎన్న‌టికీ విడిపోర‌ని, వారి మ‌ధ్య మంచి ఐక్య‌త ఉంద‌న్నారు. వంగ‌వీటి మోహ‌న్ రంగా సైతం అనుచిత వ్యాఖ్య‌ల‌తో  వంగ‌వీటి మోహ‌న రంగ ప‌రువు తీస్తున్నార‌న్నారు. కాపుల‌ను విడ‌దీయాల‌నుకుంటే న‌మ్మే స్థితిలో ఎవ‌రూ లేర‌ని, అలాగే మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కూడా కేవ‌లం దేశం, బీజేపి నాయ‌కుల‌ను తిట్ట‌డానికే ప‌ని చేశార‌ని, అధికారంలో ఉన్నా లేక‌పోయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని తిట్ట‌డ‌మే అంబ‌టి ప్ర‌ధాన ఎజెండాగా పెట్టుకున్నార‌న్నారు. ఇప్ప‌టికైన వైసిపి నేత‌లు త‌మ ప్ర‌వ‌ర్త‌నను మార్చుకోక పోతే జ‌న సైనికులు స‌హించ‌ర‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ  కార్య‌క్ర‌మంలో జ‌న సేన నాయ‌కుడు వై. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.  

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు